Janhvi Kapoor: కొన్నింటిని కోల్పోయేంత వరకు విలువివ్వడం మర్చిపోతాం: జాన్వీ కపూర్‌

తాజాగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘బవాల్‌’ (Bawaal). ఈ సినిమాను ఆదరించినందుకు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.

Updated : 23 Jul 2023 17:19 IST

ముంబయి: జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), వరుణ్‌ ధవన్‌ (Varun Dhawan) ప్రధాన పాత్రల్లో నటించిన  చిత్రం ‘బవాల్‌’ (Bawaal). నితీశ్‌ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో విడుదలైంది. ఆలోచింపజేసే చిత్రంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఇంతగా ఆదరించినందుకు జాన్వీ కపూర్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్‌ నోట్‌ రాసింది.

‘‘బవాల్‌’ మీ హృదయాలను గెలుచుకున్నందుకు ఆనందంగా ఉంది. మనం కొన్నింటి కోసం పోరాడుతూ చాలా వాటిని కోల్పోతాం. మరికొన్ని సందర్భాల్లో మన మనసు కూడా మన మాట వినపోవడం అతి పెద్ద సమస్యగా కనిపిస్తుంది. చరిత్రలో చాలా సంఘటనలను చూసినప్పుడు జీవితం క్షణికమైనదని అర్థమవుతుంది. కొన్ని విషయాలను మనం కోల్పోయే వరకు విలువ ఇవ్వడం మర్చిపోతాం. చివరికి అన్నిటికంటే ఆనందం మాత్రమే ముఖ్యమని గ్రహిస్తాం. ప్రతి దానికి విలువ ఇవ్వడం ప్రారంభిస్తాం. ‘బవాల్‌’ చూశాక అందరూ ఇలానే ఆలోచిస్తారని అనుకుంటున్నాను’’ అని జాన్వీ కపూర్‌ రాసింది. ఇక ఈ పోస్ట్‌ వైరలవుతుండడంతో నెటిజన్లు కామెంట్లలో జాన్వీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ఆమె నటన అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. ప్రతి ప్రేమకథలోనూ యుద్ధం దాగుంటుందనే అంశంతో ‘బవాల్’ తెరకెక్కిన విషయం తెలిసిందే.

అలియా భట్‌ గొప్ప నటి.. ఆ సినిమాలో ఆమె నటనకు కన్నీళ్లు వచ్చాయి: సుధామూర్తి

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘దేవర’లో జాన్వీ నటిస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. వీటితో పాటు రెండు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ జాన్వీ నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని