Sudha Murty: అలియా భట్‌ గొప్ప నటి.. ఆ సినిమాలో ఆమె నటనకు కన్నీళ్లు వచ్చాయి: సుధామూర్తి

ఈతరం నటుల్లో అలియా భట్‌ అంటే తనకు ఇష్టమని సుధామూర్తి తెలిపారు. ఆమె గొప్ప నటి అని ప్రశంసించారు.

Updated : 23 Jul 2023 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలియా భట్‌ (Alia Bhatt) గొప్ప నటి అని ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) సతీమణి, రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) కొనియాడారు. భావోద్వేగభరిత సన్నివేశాలు చూసినా తానెప్పుడూ కంటతడి పెట్టుకోలేదని అని చెప్పిన ఆమె ‘రాజీ’ (Raazi) సినిమాలోని అలియా నటనకు ఏడ్చేశానని అన్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఈ విషయాలు పంచుకున్నారు. ‘‘థియేటర్లలో తొలిసారిగా 1958లో సినిమా చూశా. అప్పటి నుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించా. నర్గిస్‌ నటననూ ఇష్టపడతా. ఈతరంలో అలియా భట్‌ నటనను అభిమానిస్తా. ఆమె గ్రేట్‌ యాక్టర్‌’’ అని పేర్కొన్నారు. సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్‌, సంగీతం గురించి తరచూ చర్చించుకుంటుంటామని తెలిపారు.

సెక్రటరీతో రేఖ రిలేషన్‌ అంటూ ప్రచారం.. ఖండించిన రైటర్‌

స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాజీ’లో అలియా మనదేశం కోసం పనిచేసే గూఢచారి పాత్రలో ఒదిగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 190 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 64వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో 15 నామినేషన్లలో పోటీ పడిన ఈ సినిమా 5 అవార్డులు దక్కించుకుంది. వాటిల్లో ఉత్తమ నటి పురస్కారం ఒకటి. అలియా భట్‌ నటించిన ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) హీరోగా నటించిన ఈ సినిమాకి కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించారు. ఆమె నటించిన హాలీవుడ్‌ మూవీ ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ (Heart of Stone).. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని