Kailash Kher: సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌పై వాటర్‌ బాటిళ్లతో దాడి..

‘మిర్చి’, ‘భరత్‌ అనే నేను’ వంటి చిత్రాల్లో హిట్‌ పాటలు ఆలపించి.. తెలుగువారికి చేరువైన హిందీ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ (Kailash Kher). తాజాగా ఆయనకు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. 

Updated : 30 Jan 2023 12:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన ప్రముఖ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌(Kailash Kher)కు చేదు అనుభవం ఎదురైంది. ‘హంపీ ఉత్సవ్‌’(Hampi Ustav)లో పాల్గొన్న ఆయనపై దాడి జరిగింది. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ షాక్‌ అయ్యారు.

కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. అయితే, తమకు కన్నడ పాటలు కావాలని డిమాండ్‌ చేస్తూ జన సమూహంలో నుంచి ఇద్దరు వ్యక్తులు ఆయనపైకి వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్నవారందరూ కంగుతిన్నారు. విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగి.. ఆ ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

‘పరుగు’, ‘మిర్చి’, ‘భరత్‌ అనే నేను’ వంటి తెలుగు చిత్రాల్లో కైలాశ్‌ పాటలు ఆలపించారు. ‘బాహుబలి’ హిందీ, తమిళ వెర్షన్స్‌లో ఆయన పాటలు పాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని