Kajal: ఆ క్షణాలు వర్ణించలేనివి: కాజల్‌

సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు మధురానుభూతులను ఆస్వాదిస్తున్నారు.

Updated : 21 Apr 2022 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు ముధురానుభూతులు ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఆమె తల్లి అయిన సంగతి తెలిసిందే. బేబి బంప్స్‌, సీమంతం ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కొన్నాళ్లుగా తన ఆనందాన్ని పంచుకొన్న ఈ అమ్మడు మంగళవారం పండంటి మగబిడ్డ(నీల్‌)కు జన్మనిచ్చింది. అయితే, ఇప్పుడు తన బిడ్డకు స్వాగతం పలుకుతూ ఒక భావోద్వేగ పోస్టు పెట్టింది. ‘నా బిడ్డ నీల్‌ను ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో సంతోషిస్తున్నాను. నీల్‌ మొదటిసారి నా ఛాతిపై పడుకొన్నప్పటి క్షణం నాజీవితంలో ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ ఒక్క క్షణం నేను ప్రేమకు సంబంధించిన లోతైన భావన పొందాను. జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తుచేసుకున్నాను. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. నేను మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డను ఎత్తుకుందామా అన్న ఆతృతను ఆనందంగా అనుభవించాను’ అని పేర్కొన్నారు. 

‘ఇప్పుడు ప్రతిరోజు మధురమైన కౌగిలింతలు, నా బిడ్డ కళ్లల్లోకి ప్రేమగా చూడటం, తనని హత్తుకోవడం, మేమిద్దరం ఎదుగుతూ, నేర్చుకుంటూ, ఒకరినొకరం ఆవిష్కరించుకొంటున్నాం. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా, నిశబ్దంగా సాగిస్తున్నాము. బిడ్డకు జన్మనిచ్చాక ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు...కానీ, కచ్చితంగా అందంగా ఉంటారు..’ అంటూ తన మాతృత్వపు ముధురానుభూతుల్ని పంచుకుంది కాజల్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని