Kamal Haasan: ఆస్కార్‌ మ్యూజియానికి వెళ్లిన కమల్ హాసన్‌.. ఫొటోలు వైరల్

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఏఆర్‌ రెహమాన్‌తో (AR Rahman) కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని ఆస్కార్‌ మ్యూజియాన్ని సందర్శించారు.

Published : 27 Jul 2023 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా  ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఆస్కార్‌ విజేత అమెరికన్‌ మేకప్‌ ఆర్టిస్టు మైఖేల్‌ వెస్ట్‌మోర్‌ (Michael Westmore)ను కూడా కలిశారు. 

అలాగే సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లోని ఆస్కార్‌ మ్యూజియాన్ని సందర్శించారు. అందులోని ఫొటోలను చూశారు. వీరిద్దరూ కలిసి 1972లో విడుదలై ఆస్కార్‌ను సొంతం చేసుకున్న ‘ది గాడ్‌ ఫాదర్‌’ (The Godfather) సినిమాను ఆ మ్యూజియంలో చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఏ ఆర్‌ రెహమాన్‌ తనకు ఆస్కార్‌ వచ్చిన ఫొటోను కమల్ హాసన్‌కు చూపిస్తోన్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. 2009లో జయహో పాటకు ఏఆర్‌ రెహమాన్‌ ఆస్కార్‌ గెలుచుకున్న  విషయం తెలిసిందే.

 ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పంథాలోనే ‘ఇండియన్‌’.. శంకర్‌ ప్లానింగ్‌ అదేనా?

కమల్‌హాసన్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ (Indian 2)లో నటిస్తున్నారు.  1996లో విడుదలై సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో  అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అలాగే నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ‘కల్కి 2898 ఏడీ’సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ విలన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని