‘కనబడుటలేదు’ టీజర్‌ క్రియేటివ్‌గా ఉంది

సుక్రాంత్‌ వీరెల్ల హీరో నటిస్తోన్న చిత్రం ‘కనుబడుట లేదు’. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌ ఫిలిమ్స్‌, శ్రీపాద క్రియేషన్స్‌, షేడ్‌ స్టూడియోస్‌ సంయుక్తగా నిర్మిస్తున్నాయి. మధు పొన్నాస్‌ సంగీతం. యూగ్రామ్‌, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్యా శెట్టి, కేరాఫ్

Updated : 07 Dec 2022 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుక్రాంత్‌ వీరెల్ల హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కనబడుటలేదు’. బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌ ఫిలిమ్స్‌, శ్రీపాద క్రియేషన్స్‌, షేడ్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మధు పొన్నాస్‌ సంగీతం అందిస్తున్నారు. యూగ్రామ్‌, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్యా శెట్టి, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్‌ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. అగ్ర దర్శకుడు సుకుమార్‌ ఈ టీజర్‌ను విడుదల  చేశారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ టీజర్‌ చాలా క్రియేటివ్‌గా ఉందన్నారు. సాంకేతిక నిపుణుల పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. హీరో సుక్రాంత్‌ సహా ఈ చిత్రంలోని నటులందరికీ మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు సుకుమార్‌ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 

ఇక టీజర్‌ విషయానికి వస్తే.. ఒక డంపింగ్‌ యార్డు వద్ద కనిపించిన రెండు శవాల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా టీజర్‌ మొదలైంది. ఓ మహిళ పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి శశిత అనే అమ్మాయి కనుబడుటలేదు అని చెప్పడంతోనే ఒక సన్నివేశానికి మరో సన్నివేశాన్ని కలుపుతూ అన్ని పాత్రలను పరిచయం చేశారు. కథ మొత్తాన్ని టీజర్‌లోనే చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న టీజరే అసాంతం ఉత్కంఠభరితంగా ఉంటే.. ఇక సినిమా ప్రేక్షకుడిని ఎంత సస్పెన్స్‌ థ్రిల్‌కు గురిచేస్తుందో అర్థమవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని