Kangana Ranaut: కంగనా ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ.. నటి ఫస్ట్‌ ట్వీట్‌ ఏంటంటే?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆమె ఖాతాను నిలిపివేసిన ట్విటర్‌ తాజాగా పునరుద్ధరించింది.

Published : 24 Jan 2023 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఖాతాను ట్విటర్‌ పునరుద్ధరించింది. ఈ మేరకు ఆమె మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘అందరికీ నమస్కారం. మళ్లీ ఇక్కడ (ట్విటర్‌లోకి)కు రావడం సంతోషంగా ఉంది’ అని ఫస్ట్‌ పోస్ట్‌ పెట్టిన నటి రెండో ట్వీట్‌లో తన కొత్త సినిమా వివరాలు ఉంచారు. ‘ఎమర్జెన్సీ’ (emergency) సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. 2023 అక్టోబరు 20న థియేటర్లలో విడుదలవుతుంది’ అని తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ‘క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ కంగనా అభిమానులు, ట్విటర్‌ యూజర్లు కామెంట్ల రూపంలో ఆమెకు స్వాగతం పలుకుతున్నారు.

బెంగాల్‌ ఎన్నికల పరిణామాలపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్‌ చేసి.. సంస్థ నిబంధనలను కంగనా ఉల్లంఘించారంటూ ట్విటర్‌ 2021 మేలో ఆమె ఖాతాను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అకౌంట్‌ను పునరుద్ధరించారు. ‘బ్లూటిక్‌’ను ఇంకా జారీ చేయలేదు. సినిమా విషయానికొస్తే.. స్వతంత్ర భారతంలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రమే ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమాకి కంగనానే దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని