NTR: కర్ణాటక సీఎం ప్రత్యేక ఆహ్వానం.. విధానసౌధకు వెళ్లనున్న ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ నటుడు తారక్‌కు విశేష గౌరవం దక్కింది. త్వరలో ఆయన కర్ణాటక విధానసౌధలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated : 29 Oct 2022 17:15 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ (NTR) త్వరలో కర్ణాటకకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ఆహ్వానం మేరకు నవంబర్‌ 1న అక్కడి విధానసౌధలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో విశిష్ఠ పురస్కారంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్‌ పేరు సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా కర్ణాటకలోనూ ఎన్టీఆర్‌కు ఉన్న విశేష ఆదరణ, పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు రజనీకాంత్‌, జ్ఞానపీఠ్​అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని