Karthi: మా అన్నయ్య సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది: కార్తి

హీరో కార్తి త్వరలోనే ‘‘సర్దార్‌’’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తి తన దర్శకత్వ ఆలోచనల గురించి చెప్పారు.

Published : 17 Oct 2022 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్: హీరో కార్తి ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. త్వరలోనే ‘‘సర్దార్‌’’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కార్తి తన దర్శకత్వ ఆలోచనల గురించి చెప్పాడు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన కెరీర్‌ ఎలా ప్రారంభమైందో గుర్తుచేసుకున్నాడు. ‘మీరు ఏ హీరో సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటున్నారు’ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘‘నేను మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ ప్రారంభించింది మా అన్నయ్య సూర్య నటించిన సినిమాతోనే. నేను దర్శకత్వం వహించే తొలి సినిమాలో ఆయనే హీరోగా ఉంటారు. ఎందుకంటే తను నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నా చెయ్యి పట్టుకొని చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చాడు. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే నాకు మా అన్నయ్య నటించే సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని