Updated : 24 Jun 2022 17:47 IST

Karthikeya 2: ఉత్కంఠ రేకెత్తించేలా ‘కార్తికేయ 2’ ట్రైలర్‌.. ద్వారకా నగర రహస్యమేంటి?

హైదరాబాద్‌: సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ఒకటి. నిఖిల్‌ (Nikhil Siddharth) కథానాయకుడిగా చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జులై 22న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏఎంబీ సినిమాస్‌ స్క్రీన్‌- 3లో చిత్ర బృందం తొలి ట్రైలర్‌ను ఆవిష్కరించింది. సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌తో అర్థమైంది. దానికి సంబంధించి ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. ‘అసలు కృష్ణుడు ఏంటి?ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?’ అంటూ నిఖిల్‌.. ‘విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే’ అంటూ అనుపమ్‌ ఖేర్‌ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

నిఖిల్‌- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందుతుండటంతో ‘కార్తికేయ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కనిపించనుంది. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకాబోతోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని