Keerthy Suresh: కీర్తి సురేశ్‌ ‘గాంధారి’.. డ్యాన్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే!

‘గాంధారి’గా అలరిస్తున్న కీర్తి సురేశ్‌. తన డ్యాన్స్‌తో ఫిదా చేస్తోంది. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించగా బృందా మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు. 

Updated : 21 Feb 2022 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలువురు తారలు సినిమాలతోపాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. తమలోని కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తుంటారు. అలా ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ చేసిన ఓ ప్రయత్నమే ‘గాంధారి’. ది రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌ తాజాగా విడుదలైంది. నృత్య ప్రధానంగా సాగే ఈ పాటలో కీర్తి సురేశ్‌ వేషధారణ, హావభావాలు అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటను అనన్య భట్‌ ఆలపించారు. ‘లవ్‌స్టోరీ’ ఫేం పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించగా.. బృందా మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని