‘కోలుకోలు’ పాట మేకింగ్‌ వీడియో చూశారా..!

స్వచ్ఛమైన పల్లెటూరి యువతి మనసులో ప్రేమ కలిగితే అది ఎంత గాఢంగా, ఎంత సాంద్రంగా, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడమే ఈ ‘కోలుకోలు’ పాట ముఖ్య ఉద్దేశమని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ అన్నారు. ‘విరాట పర్వం’ చిత్రం నుంచి ఇటీవల విడులైన

Published : 10 Mar 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వచ్ఛమైన పల్లెటూరి యువతి మనసులో ప్రేమ కలిగితే అది ఎంత గాఢంగా, ఎంత సాంద్రంగా, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడమే ఈ ‘కోలుకోలు’ పాట ముఖ్య ఉద్దేశమని ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ అన్నారు. ‘విరాట పర్వం’ చిత్రం నుంచి ఇటీవల విడులైన ఈ ‘కోలుకోలు’ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సాంగ్‌ మేకింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో పంచుకుంది. ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి గల అంశాలను చిత్రబృందం ఆ వీడియోలో పంచుకుంది. బాణీతోపాటే పాట పుట్టిందేమో అనిపించేలా చంద్రబోస్‌ అద్భుతంగా పాటను రాశారని సంగీత దర్శకులు సురేశ్‌ బొబ్బిలి అన్నారు. ఈ పాటను దివ్య మాలిక ఆలపించారు.

కాగా.. 90వ దశకంలో తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ఇతివృత్తంగా డైరెక్టర్‌ వేణు ఉడుగుల ‘విరాట పర్వం’ చిత్రాన్ని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా కనిపించనున్నారు. ప్రియమణి కీలక పాత్రలో సందడి చేయనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని