Cinema News: వీకెండ్‌తో కుస్తీ.. ఈ సినిమాలతో మస్తీ

వారం మొత్తం ఆఫీస్‌ కాల్స్‌, మీటింగ్స్‌, బిజినెస్‌ వర్క్స్‌ ఇలా ఇతరత్రా పనులతో ఫుల్‌ బిజీగా ఉన్న వారందరికీ ఉపశమనం వీకెండ్‌. మరి, ఈ వీకెండ్‌ని మరింత జోష్‌ఫుల్‌గా గడిపేందుకు ప్రతి ఒక్కరూ..

Published : 07 May 2022 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ వీకెండ్‌ని మరింత జోష్‌ఫుల్‌గా గడిపేందుకు పలు కొత్త సినిమాలు మనముందుకొచ్చాయి. కొంతమంది ఓటీటీల్లో, మరికొంతమంది థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా, ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధార్’‌, ‘ఆహా’లో ‘దొంగాట’ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు తెలుగు చిత్రాలేంటంటే..

జయమ్మ పంచాయితీ:

వ్యాఖ్యాతగా తెలుగువారికి సుపరిచితురాలైన సుమ మొదటిసారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ దర్శకుడు. కుటుంబకథా చిత్రంగా సిద్ధమైన ఈ సినిమా శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊరంతా త‌న‌దే, అందరికీ చేతనైనంత సాయం చేయాలనుకునే తత్వం కలిగిన జయమ్మ.. తనకెదురైన సమస్యను పరిష్కరించుకోగలిగిందా? లేదా? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

రివ్యూ: జయమ్మ పంచాయితీ

భళా తందనాన: 

విభిన్నమైన కథలతో తరచూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు. ‘అర్జునా ఫాల్గుణ’ తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘భళా తందనాన’. ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేథరిన్‌ కథానాయిక. హ‌త్యోదంతం చుట్టూ తిరిగే ఈ సినిమా కథేంటంటే..

రివ్యూ: భళా తందనాన

అశోకవనంలో అర్జునకళ్యాణం:

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ నటించిన యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయిక. పెళ్లి కోసం ఎదురుచూసే 33 ఏళ్ల వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? చివరికి అతను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే ఆసక్తికర అంశాలతో సిద్ధమైందీ చిత్రం.

రివ్యూ: అశోకవనంలో అర్జునకళ్యాణం

చిన్ని:

మహానటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్‌. ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘చిన్ని’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకుడు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా విడుదలైంది. రివేంజ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అన్యాయంగా తన భర్తను చంపి, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వారిపై ఓ మహిళ ఏ విధంగా పగ తీర్చుకుంది. అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

రివ్యూ: చిన్ని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని