Tollywood: ‘చంద్రముఖి-2’ మొదలైంది.. కిరణ్‌ ప్రాజెక్ట్‌లివే..!

రజనీకాంత్‌-జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ ‘చంద్రముఖి’కి(Chandramukhi) ఇప్పుడు సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్‌(Raghava Lawrence) హీరోగా ఇది సిద్ధం కానున్నట్ల....

Published : 15 Jul 2022 16:02 IST

హైదరాబాద్‌: రజనీకాంత్‌ హీరోగా వచ్చిన సూపర్‌హిట్‌ ‘చంద్రముఖి’కి(Chandramukhi) ఇప్పుడు సీక్వెల్‌ రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్‌(Raghava Lawrence) హీరోగా ఇది సిద్ధం కానున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ‘చంద్రముఖి-2’(Chandramukhi 2) షూట్‌ మైసూర్‌లో మొదలైంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ లారెన్స్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. తాను గురువుగా భావించే తలైవా రజనీకాంత్‌ ఆశీస్సులు తీసుకుని షూట్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు.

కిరణ్‌ కొత్త ప్రాజెక్టులు

యువ హీరో కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన శుక్రవారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని మరో రెండు ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌ చేశారు. ఇందులో ఒకటైన ‘మీటర్‌’కు (Meter) రమేశ్‌ కాడూరి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. ఇక, మరొక చిత్రానికి ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారు. రత్నంకృష్ణ దర్శకుడు. నేహాశెట్టి కథానాయిక.

శివకార్తికేయన్‌ కొత్త సినిమా

‘రెమో’, ‘డాక్టర్‌’, ‘డాన్’ వంటి చిత్రాలతో తెలుగువారికీ చేరువైన కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan)‌. ఆయన హీరోగా కొత్త ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది. అశ్విన్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని మహేశ్‌బాబు సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని అలరించనున్న ఈ చిత్రానికి ‘మావీరన్‌’ (Maaveeran) అనే పేరు ఖరారు చేశారు. తెలుగులో దీన్నే ‘మహావీరుడు’గా విడుదల చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని