Miss Perfect: ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’గా లావణ్య త్రిపాఠి.. హీరో ఎవరంటే..?

నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) నటిస్తోన్న కొత్త వెబ్‌సిరీస్‌ టీజర్‌ విడుదలైంది.

Updated : 11 Jan 2024 18:14 IST

హైదరాబాద్‌: వివాహం తర్వాత తొలి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati). డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానున్న ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విశ్వక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్‌ విజేత, నటుడు అభిజీత్‌ హీరోగా కనిపించనున్నారు. తాజాగా సిరీస్‌ టీజర్‌ విడుదలైంది.

‘‘నేను తెలిసిన ఎవరికైనా నా గురించి తెలిసే ఫస్ట్‌ థింగ్‌. నాకు క్లీనింగ్‌ అంటే చాలా ఇష్టం. పర్‌ఫెక్షన్‌ ప్రాబ్లమ్‌ ఎలా అవుతుంది?’’ అంటూ లావణ్య చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌గా రూపుదిద్దుకుంటోంది. ఝాన్సీ, హర్షవర్ధన్‌ కీలకపాత్రలు పోషించారు. త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.

కమల్‌ హాసన్‌తో మరో సినిమా అందుకే 37 ఏళ్లు పట్టింది: మణిరత్నం

‘పులిమేక’తో ఓటీటీలోకి అడుగుపెట్టారు లావణ్యత్రిపాఠి. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో జీ5 స్పెషల్‌గా విడుదలైన ఈ సిరీస్‌ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా లావణ్య నటనకు ప్రశంసలు దక్కాయి. వ్యక్తిగత విషయాలకు వస్తే.. నటుడు వరుణ్‌ తేజ్‌తో నవంబర్‌లో ఆమె వివాహం జరిగింది. వివాహమైన తర్వాత తొలి ప్రాజెక్ట్‌గా ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. ఆధ్వర్య హీరోగా తెరకెక్కుతోన్న కోలీవుడ్‌ చిత్రంలో లావణ్య నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని