Leo: విడుదలకు ముందే ‘జైలర్‌’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘లియో’.. ‘ఆర్‌ఆర్‌ఆర్’తోనూ పోటీ..

‘లియో’ (Leo) కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.

Published : 17 Oct 2023 14:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విజయ్ ‘లియో’ (Leo) విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు విడుదల దగ్గరపడుతుండడంతో మరికొన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ‘లియో’ హవానే కొనసాగుతోంది. ఎక్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

స్టార్‌ హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌ల ‘విక్రమ్‌’, ‘జైలర్‌’ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. అయితే ఓవర్సీస్‌లో వీటి టికెట్ల సేల్స్ మిలియన్‌ మార్క్‌ను చేరుకోలేకపోయాయి. తాజాగా ‘లియో’ ఆ మార్క్‌ను అవలీలగా చేరుకుంది. ఈ సినిమా విడుదల రెండు రోజుల ముందే ఓవర్సీస్‌లో దీని టికెట్లు వన్‌ మిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడయ్యాయి. మరోవైపు యూకేలోనూ రిలీజ్‌కు ముందే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఇండియన్‌ సినిమాగా ‘లియో’ రికార్డు సృష్టించింది. 30ఏళ్ల సినీ కెరీర్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకున్న విజయ్‌ తొలిచిత్రం ‘లియో’ కావడం విశేషం. ఇక గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా విడుదలకు ముందే అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో వన్‌ మిలియన్ల డాలర్లను వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోనూ ‘లియో’ హవా కనిపిస్తోంది. అక్కడ మొదటిరోజు 15000 టికెట్లు అమ్ముడయ్యాయి.

ముద్దు వివాదం.. బిగ్‌బాస్‌లో మరోసారి క్లారిటీ ఇచ్చిన నటి..

ఇక విజయ్‌ కనగరాజ్‌-విజయ్‌ల కాంబోలో రానున్న సినిమా కావడంతో దీనిపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్‌ 19న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని