Leo: తోపులాటలో గాయపడ్డ లోకేశ్‌ కనగరాజ్‌..

కోలీవుడ్‌ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ గాయలయ్యాయి. కేరళలోని ఓ థియేటర్‌కు వెళ్లిన ఆయన్ని చూడడానికి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.

Updated : 24 Oct 2023 16:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కోలీవుడ్‌ స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) గాయపడ్డారు. ఆయన తాజా చిత్రం ‘లియో’ ప్రమోషన్స్‌ కోసం పలు ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ థియేటర్లకు వెళ్లి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళలోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు లోకేశ్‌ కనగరాజ్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఒక్కసారిగా సెల్ఫీల కోసం ఆయన దగ్గరకు వచ్చేసరికి చిన్న తోపులాట జరిగింది. దీంతో ఆయన గాయపడ్డారు.

ఈ విషయాన్ని లోకేశ్ కనగరాజ్‌ తన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. తనపై ఇంత ప్రేమ చూపించిన కేరళ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ‘జనసమూహంలో చిక్కుకుని నాకు చిన్నపాటి గాయాలయ్యాయి. అందువల్లే ఇంకా రెండు ప్రాంతాల్లో జరగాల్సిన ప్రెస్‌మీట్స్‌కు హాజరుకాలేకపోతున్నా. త్వరలోనే మళ్లీ కేరళ వచ్చి మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు ‘లియో’ను చూసి ఎంజాయ్ చేయండి’ అని తన ఎక్స్‌లో రాసుకొచ్చారు. అభిమానులతో దిగిన ఓ ఫొటోను ఆయన షేర్ చేశారు.

ఓటీటీలో జయం రవి.. నయన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇక అక్టోబర్‌ 19న విడుదలైన ‘లియో’(Leo) హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన త్రిష కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని