Iraivan ott: ఓటీటీలో జయం రవి.. నయన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

జయం రవి, నయనతార కీలక పాత్రల్లో ఐ.అహ్మద్‌ దర్శకత్వంలో ‘ఇరైవన్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 24 Oct 2023 13:39 IST

హైదరాబాద్‌: జయం రవి, నయనతార కీలక పాత్రల్లో ఐ.అహ్మద్‌ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఇరైవన్‌’. తెలుగులో ‘గాడ్‌’ (God Movie ott Relase) పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబరు 26వ తేదీ (iraivan ott release date) నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది.

క‌థేంటంటే: అర్జున్ (జ‌యం ర‌వి) అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌. భ‌య‌మంటే ఏమిటో తెలియ‌ని వ్య‌క్తిత్వం త‌న‌ది. కోపం.. దూకుడు రెండూ ఎక్కువే. నేర‌స్థుల్ని శిక్షించే క్ర‌మంలో అవ‌స‌ర‌మ‌నుకుంటే చ‌ట్టాన్ని మీర‌డానికైనా వెన‌కాడడు. త‌న‌ మిత్రుడు, స‌హోద్యోగి ఆండ్రూ (న‌రైన్) అంటే అర్జున్‌కు చాలా ఇష్టం. అత‌ని కుటుంబాన్ని సొంత కుటుంబంలా భావిస్తుంటాడు. వృత్తిప‌రంగా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల‌కు స్మైలింగ్ కిల్ల‌ర్ బ్ర‌హ్మ (రాహుల్ బోస్‌) రూపంలో స‌వాల్ ఎదుర‌వుతుంది.సైకో కిల్ల‌ర్ అయిన అత‌ను న‌గ‌రంలో అనేక మంది యువ‌తుల్ని కిడ్నాప్ చేసి.. వారిని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేసి త‌ప్పించుకు తిరుగుతుంటాడు.  దీంతో అత‌ని ఆట‌క‌ట్టించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగుతుంది.  అయితే బ్ర‌హ్మ‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో అనుకోకుండా ఆండ్రూ ప్రాణాలు కోల్పోతాడు. ఆ బాధ‌లో అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి త‌ప్పుకొంటాడు. కానీ, బ్ర‌హ్మ జైలు నుంచి త‌ప్పించుకోవ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌ట‌కొస్తుంది. న‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌లు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయి. అయితే ఈసారి బ్ర‌హ్మ.. అర్జున్ స‌న్నిహితుల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డం ప్రారంభిస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?సైకో కిల్ల‌ర్ బ్ర‌హ్మ‌ను ప‌ట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయి?వాటిని త‌నెలా ప‌రిష్క‌రించాడు? ప్రియాతో అత‌ని ప్రేమాయ‌ణం ఏమైంది? అన్న‌ది మిగతా క‌థ‌.

‘గాడ్‌’ మూవీ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని