Devil: మది దోచేసిందే సిన్నగా!

‘‘ఏదో అయ్యిందిలే.. గుండె ఝల్లందిలే.. ఒయ్‌ పిల్లా నీ వల్లే’’ అంటూ సంయుక్తతో కలిసి ప్రేమ పాట పాడుకుంటున్నారు హీరో కల్యాణ్‌ రామ్‌.

Updated : 20 Sep 2023 14:01 IST

‘‘ఏదో అయ్యిందిలే.. గుండె ఝల్లందిలే.. ఒయ్‌ పిల్లా నీ వల్లే’’ అంటూ సంయుక్తతో కలిసి ప్రేమ పాట పాడుకుంటున్నారు హీరో కల్యాణ్‌ రామ్‌. ఇప్పుడీ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘డెవిల్‌’. బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌.. అన్నది ఉపశీర్షిక. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. ‘‘మాయే చేసి మెల్లగా.. మది దోచేసిందే సిన్నగా. చూపే చూసి సన్నగా.. నను చంపేసిందే సూటిగా’’ అంటూ సాగుతున్న ఈ పాటకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చారు. సత్య ఆర్‌.వి సాహిత్యమందించారు. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని