Mahesh Babu: ఆయన వీరాభిమానుల్లో నేనూ ఒకడిని.. మహేశ్‌బాబు ఎమోషనల్ లెటర్ వైరల్
సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) జయంతిని పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu)
హైదరాబాద్: తన తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) జయంతిని పురస్కరించుకుని మహేశ్‌బాబు (MaheshBabu) భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) సినిమా రీ రిలీజ్ కావడంపై ఆయన స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తన తండ్రికి ఉన్న వీరాభిమానుల్లో తానూ ఒకడిని అని చెప్పారు.
‘‘నాన్నగారి వీరాభిమానుల్లో నేనూ ఒకడిని. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై ఆయన తెరకెక్కించిన ఎన్నో గొప్ప సినిమాల్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ చిత్రాలను తలదన్నే స్థాయిలో ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించిన సాహసి ఆయన. యాభైరెండేళ్ల క్రితమే గుర్రాలు, గన్ ఫైటింగులు, భారీ సెట్టింగులు, అందమైన లొకేషన్స్, ట్రెజర్ హంట్, అతిపెద్ద తారాగణం, కౌబాయ్ గెటప్స్‌తో బడ్జెట్ పరిధులు దాటి.. తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, బెంగాలీ వంటి అన్ని భాషల్లోనూ ఈ సినిమాను 50 దేశాల్లో చూపించిన ఘనత ఆయనది. నాన్నగారి జయంతిని పురస్కరించుకుని నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తెలుగు సినిమాకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ ఆయన. మొదటి స్టీరియో సౌండ్, సినిమా స్కోప్, 70 ఎమ్ ఎమ్, మొదటి జేమ్స్‌బాండ్, కౌబాయ్.. ఇలా అన్ని కొత్త హంగులను తెలుగు సినిమాలకి తెచ్చి, సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన నాన్న జ్ఞాపకార్థం మనమందరం మళ్లీ ‘మోసగాళ్లకు మోసగాడు’ డిజిటల్‌లో కొత్త సాంకేతిక విలువలతో చూసి, ఆనందాన్ని పొంది ఆయన్ని స్మరించుకుందాం’’ అని మహేశ్‌బాబు రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..
-
Tamil Nadu : తమిళనాడులో అవయవదాత మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు