న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కంబాలపల్లి కథలు

యువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రియాంకదత్‌ నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్‌1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు ఎంపికైంది.

Updated : 08 May 2021 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు ప్రియదర్శి నటించిన ‘కంబాలపల్లి కథలు’ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రియాంకదత్‌ నిర్మించారు. ఈ వెబ్‌సిరీస్‌లో ఛాప్టర్‌1గా వచ్చిన ‘మెయిల్’ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. ఇప్పుడు అది ఏకంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు ఎంపికైంది. జూన్‌ 4న న్యూయార్క్‌ వేదికగా ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా ట్విటర్‌లో పంచుకుంది. ‘‘ఈ క్లిష్ట సమయంలో ప్రపంచానికి ఒక సంతోషకరమైన ‘మెయిల్’ పంపిస్తున్నాం. జూన్ 4న న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా చిత్రాన్ని చూడండి’’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావాలని కలలు కనే గ్రామీణప్రాంతానికి చెందిన ఒక యువకుడి కథతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా.. విడుదలైన ఈ సిరీస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చాలామందికి తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని