Mangalavaaram: అల్లు అర్జున్‌ వల్లే ఈ సినిమా చేయాలనే ధైర్యం వచ్చింది!

‘‘డార్క్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రం ‘మంగళవారం’. ఇందులో మంచి సందేశం, పాటలు, ఎమోషన్స్‌.. అన్నీ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి.

Updated : 15 Nov 2023 13:28 IST

‘‘డార్క్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రం ‘మంగళవారం’. ఇందులో మంచి సందేశం, పాటలు, ఎమోషన్స్‌.. అన్నీ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి. ఇది ఆమెకు నిర్మాతగా తొలి సినిమా. అజయ్‌ భూపతి తెరకెక్కించారు. ఎం.సురేశ్‌ వర్మ మరో నిర్మాత. పాయల్‌ రాజ్‌పూత్‌, అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిర్మాతలు.

ఈ స్థాయి స్పందనను ఊహించలేదు..

‘‘ఇది డార్క్‌ థ్రిల్లర్‌ అయినా.. దీంట్లో అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. అందుకే కథ విన్న వెంటనే పక్కా చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు అజయ్‌తో స్క్రిప్ట్‌ వినిపించాం. తను కథ బాగుంది.. ధైర్యంగా ముందుకెళ్లమని చెప్పారు. అలాగే ఎవరైనా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అల్లు అర్జున్‌ చెప్పిన ఆ మాటల వల్ల సినిమా చేయాలనే ధైర్యం వచ్చింది. అలా సురేష్‌ వర్మతో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టా. ప్రస్తుతం మా ‘మంగళవారం’ చిత్రానికి వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు. మా మొదటి ప్రయత్నానికే అందరి నుంచి ఇంత మద్దతు లభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’. 

స్వాతిరెడ్డి


చిరు స్పందన.. మర్చిపోలేని అనుభూతి!

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ టైంలోనే అజయ్‌ భూపతి ఈ ‘మంగళవారం’ కథ వినిపించారు. తన ఆలోచన నాలో ఎంతో ఆసక్తిరేకెత్తించింది.  ఈ చిత్ర విషయంలో అల్లు అర్జున్‌ మమ్మల్ని తొలి రోజు నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఈరోజు ఆయన మా సినిమా గురించి ట్వీట్‌ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి’’.   

 సురేశ్‌ వర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని