Chiranjeevi: బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ మూవీలో చిరంజీవి.. వీడియో రిలీజ్‌

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి భాగమయ్యారు. అయితే ఆయన స్క్రీన్‌పై కనిపించరు కేవలం వినిపిస్తారు మాత్రమే. ఇంతకీ చిరు వాయిస్‌ అందిస్తోన్న ఆసినిమా ఏమిటంటే..

Published : 13 Jun 2022 13:46 IST

 

ముంబయి: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి భాగమయ్యారు. అయితే ఆయన స్క్రీన్‌పై కనిపించరు కేవలం వినిపిస్తారు మాత్రమే. ఇంతకీ చిరు వాయిస్‌ అందిస్తోన్న ఆసినిమా ఏంటంటే.. ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ట్రైలర్‌ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఈ సినిమా ట్రైలర్‌ తెలుగువారికి మరింత చేరువయ్యేలా మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు వాయిస్‌ ఓవర్‌ అందిస్తోన్న ఓ వీడియోని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. చిరు చేసిన సాయానికి సంతోషం వ్యక్తం చేసిన ఆయాన్‌ ముఖర్జీ.. ఆయన కాళ్లను తాకి మర్యాదపూర్వకంగా నమస్కరించారు. ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలు పోషించారు. ఇక, ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్‌ రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని