Chiranjeevi: కర్ణాటకలో మెగా మేనియా.. నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ అంటోన్న ఫ్యాన్స్‌

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) రిలీజ్‌ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. కర్ణాటకలోని మెగా అభిమానులు భారీ ర్యాలీతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Updated : 29 Jun 2023 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమా విడుదల పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనూ సందడి వాతావరణం నెలకొంది. ఈ మేరకు మెగా అభిమానులందరూ కలిసి బెంగళూరులో సుమారు 154 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ‘‘మెగా మేనియా షురూ’’, ‘‘పక్క రాష్ట్రంలోనూ ఇలాంటి వేడుకలు నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వింటేజ్‌ చిరు ఈజ్‌ బ్యాక్‌: మంచు లక్ష్మి

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు నటి మంచు లక్ష్మి (Manchu lakshmi). వింటేజ్‌ చిరంజీవి ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘డోంట్‌ స్టాప్‌ డ్యాన్సింగ్‌ పూనకాలు లోడింగ్‌. సంక్రాంతి సంబరాలు భారీగా జరుగుతున్నాయి. బాక్సాఫీస్‌ వేదికగా ‘బాస్‌ ఆఫ్‌ మాసెస్‌’.. ‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌’ను కలిస్తే సెలబ్రేషన్స్‌ వీరమాస్‌లో ఉంటాయి. వింటేజ్‌ చిరంజీవి ఈజ్‌ బ్యాక్‌. రవితేజ స్క్రీన్‌పై కనిపించిన క్షణాలు మరోస్థాయిలో ఉన్నాయి’’ అని మంచు లక్ష్మి అన్నారు.

ఈ క్షణం కోసం వెయిటింగ్‌..!

చిత్ర దర్శకుడు బాబీతో (Bobby) కలిసి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను ఎంజాయ్‌ చేశారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (DSP). సినిమాలోని పాటలకు అభిమానుల నుంచి వస్తోన్న స్పందన చూసి ఆయన ఆనందించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘శ్రీదేవి చిరంజీవి.. లిరిక్స్‌ రాసి, కంపోజ్‌ చేసిన నాటి నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. థియేటర్‌లో అభిమానులు ఈ పాటను ఎంజాయ్‌ చేయడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మెగాస్టార్‌పై నాకున్న అభిమానాన్ని ఈ విధంగా తెలిపాను’’ అని రాసుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని