Modern Love Hyderabad: సరికొత్త ప్రేమకథలు ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’

‘భాష కనిపెట్టక ముందే, మాట్లాడటం రాకముందే మనుషులు ప్రేమించుకున్నారు’ అంటూ ప్రేమకు విశిష్టతను చెబుతోంది ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’(Modern Love Hyderabad) టీమ్‌.

Published : 28 Jun 2022 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భాష కనిపెట్టక ముందే.. మాట్లాడటం రాకముందే మనుషులు ప్రేమించుకున్నారు’ అంటూ ప్రేమకు విశిష్టతను చెబుతోంది ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’(Modern Love Hyderabad) టీమ్‌. ఆది పినిశెట్టి, నిత్యా మేనన్‌, మాళవికా నాయర్‌, రీతూ వర్మ, అభిజీత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జులై 8న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ విడుదల చేశారు. నేటి ఆధునిక ప్రేమకు భావోద్వేగాలను జోడించి తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్‌లో ప్రముఖ నటులు సుహాసిని, రేవతి తదితరులు కూడా నటించారు. ప్రేమలోని విభిన్న పార్శ్వాలను తాకే ఈ కథకు నగేశ్‌ కుకునూర్‌, వెంకటేశ్‌ మహా, ఉదయ్‌ గుర్రాల, దేవిక దర్శకత్వం వహించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన అమెరికన్‌ సిరీస్‌ల్లో ‘మోడర్న్‌ లవ్‌’ (Modern Love) ఒకటి. దీన్ని భారతీయ సినీ ప్రియులకు మరింత దగ్గర చేసేందుకు ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video) ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హిందీ ప్రేక్షకుల కోసం ‘మోడర్న్‌ లవ్‌: ముంబయి’ అనే సిరీస్‌ను తీసుకొచ్చింది. అలా తెలుగు ప్రేక్షకుల కోసం ‘మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్‌’ను రూపొందించింది. కోలీవుడ్‌ ప్రేక్షకుల కోసం ‘మోడర్న్‌ లవ్‌: చెన్నై’ త్వరలోనే రాబోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని