Mohan Babu Home Tour: ‘పెదరాయుడు’ ఉయ్యాల.. రోజ్‌వుడ్‌ మెట్లు చూశారా?

చెక్కతో చేసిన మెట్లు మీరెప్పుడైనా చూశారా? పైగా రోజ్‌వుడ్‌తో తయారైనవి ఎక్కడైనా దర్శనమిచ్చాయా? లేదు అంటే ఓ సారి ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఇంటిని చూసేయండి.

Published : 02 May 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెక్కతో చేసిన మెట్లు కొన్ని ఇళ్లలోనే దర్శనమిస్తుంటాయి. రోజ్‌వుడ్‌తో తయారైనవి అరుదుగా కనిపిస్తుంటాయి. వాటిని ఇప్పటి వరకూ చూడలేదు అంటే ఓ సారి ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఇంటిని చూసేయండి. రోజ్‌వుడ్‌ మెట్లతోపాటు ఆయన నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘పెదరాయుడు’లో వినియోగించిన ఉయ్యాల మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ‘ఆయన ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు కదా! అయినా మేం ఆయన ఇంట్లోకి ఎలా వెళ్లగలం’ అని సందేహిస్తున్నారా? మీలాంటి వారి కోసమే మోహన్‌బాబు తనయ, నటి లక్ష్మి ‘హోమ్‌ టూర్‌’ పేరిట ఆసక్తికర వీడియోలు రూపొందిస్తోంది. హైదరాబాద్‌లోని ఇంద్రభవనం లాంటి తమ గృహాన్ని ఇప్పటికే అభిమానులకు చూపించగా ఇప్పుడు తిరుపతిలోని ఇంటి విశేషాలు పంచుకుంది. ఈ హౌజ్‌లోనే రోజ్‌వుడ్‌తో చేయించిన స్టెప్స్‌ ఉన్నాయి.

హోమ్‌టూర్‌ సందర్భంగా లక్ష్మి తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది. ఒకప్పుడు ఆ ఇంటి కింది భాగంలో కంప్యూటర్‌ ల్యాబ్‌ నిర్వహించేవారని, పై భాగంలో ఒకే గది ఉండేదని, అందులోనే తామంతా ఉండేవారమని తెలిపింది. అలా ఉన్న ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దారని చెప్పింది. సాయంత్రం వేళ కాలక్షేపానికి తన తండ్రి కూర్చునే స్థలం, వ్యక్తిగత గది, పూజ గది, బెడ్‌ రూమ్‌, ఫొటో ఫ్రేమ్‌లు, డైనింగ్‌ టేబుల్‌, మంత్ర ముగ్దుల్ని చేసే పెయింటింగ్‌లు తదితర వాటిని చూపించింది. ఆ ఇంట్లో పనిచేసే వారిని పరిచయం చేసింది. ఇంకా ఆలస్యమెందుకు మోహన్‌బాబు హోమ్‌ను చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని