MohanBabu: జీవితంలో ఎన్నోసార్లు మోసపోయా.. ఎవరూ నాకు ఉపయోగపడలేదు: మోహన్‌బాబు

జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు ఎదుటివారికి రాకూడదని అన్నారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. శ్రీవిద్యానికేతన్‌ 30వ వార్షికోత్సవం, మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలను శనివారం తిరుపతిలో నిర్వహించారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థ....

Updated : 20 Mar 2022 14:29 IST

హైదరాబాద్‌: జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలు ఎదుటివారికి కూడా రాకూడదని అన్నారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. శ్రీవిద్యానికేతన్‌ 30వ వార్షికోత్సవంతోపాటు మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలను శనివారం తిరుపతిలో నిర్వహించారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ గురూజీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మోహన్‌బాబు మాట్లాడారు.

‘‘జీవితం కష్టాలమయం. ఏదో సాధించాలనే పట్టుదలతో చిత్తూరు నుంచి మద్రాసు వెళ్లాను. నటుడిని కావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. దాదాపు ఏడేళ్లు తిండి లేక, వేసుకోవడానికి చెప్పుల్లేక, ఉన్న రెండు జతల బట్టలతో, కారు షెడ్డులో ఉంటూ చెప్పలేనన్ని ఇబ్బందులు పడ్డాను. ఇలా ఎన్నో కష్టాలు పడిన తర్వాత దాసరి నారాయణరావు నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత అద్భుతమైన పాత్రలు చేశాను. నిర్మాతగానూ మారాను. కెరీర్‌లో ఎన్నో జయాపజయాలు చూశా. నా జీవితం ప్రతిరోజూ ముళ్లబాటలా ఉండేది. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ‘శ్రీ విద్యానికేతన్‌’ స్థాపించాం. కులమతాలకు అతీతంగా 25 శాతం ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ స్థాయికి వచ్చాక.. జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను అనుభవించిన కష్టాలు.. ఎదుటివారెవ్వరికీ రాకూడదని భావిస్తున్నా. నేను ఇతరులకు ఉపయోగపడ్డాను. కానీ, ఎదుటివారెవరూ నాకు ఉపయోగపడలేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు నాతో ప్రచారం చేయించుకున్నారు.. కానీ వాళ్ల సాయం నాకు ఎప్పటికీ ఉండదు. నేను వాళ్లని సాయం అడగను కూడా. ఎన్నోసార్లు మోసపోయా.. జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పింది’’ అని మోహన్‌బాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని