Naa Saami Ranga: మూడు నెలల్లో సినిమా పూర్తిచేయడం అంత తేలిక కాదు: నాగార్జున

నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రం ‘నా సామి రంగ’. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

Published : 10 Jan 2024 22:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్రాంతి పండగకు కిష్టయ్య (పాత్ర పేరు) వస్తున్నాడు.. బాక్సాఫీసు వద్ద హిట్‌ కొట్టబోతున్నాడంటూ అభిమానుల్లో జోష్‌ నింపారు ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna). ‘నా సామి రంగ’ (Naa Saami Ranga) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. ఈయన హీరోగా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథన్‌, మిర్నా మేనన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కీలక పాత్రలు పోషించారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించారు.

‘కంగువ’ పూర్తి చేసిన సూర్య.. మణిరత్నం చిత్రంలో జోజూజార్జ్‌

‘‘టీవీలు వచ్చిన సమయంలో సినిమాల పని అయిపోయింది.. ఎవరూ వాటిని చూడరు అని అన్నారు. తర్వాత డీవీడీలు, ఫోన్‌లు, ఓటీటీలు.. ఇలా ఏ టెక్నాలజీ వచ్చినా సినిమాలపై ప్రభావం పడుతుందనే మాట వినిపించేది. కానీ, సినిమా ఆగలేదు. ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగకు సినిమాలు చూడడం మన ఆనవాయితీ. ఈ పండగకు నాలుగు చిత్రాలు వస్తున్నాయి. మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హను-మాన్‌’, వెంకటేశ్‌ ‘సైంధవ్‌’ చిత్ర బృందాలకు ఆల్‌ ది బెస్ట్‌. మేం ‘నా సామి రంగ’తో రాబోతున్నాం. మా సినిమాకి స్టార్‌.. సంగీత దర్శకుడు కీరవాణి. షూటింగ్‌ ప్రారంభంకాకముందే మూడు పాటలు, పలు సన్నివేశాలకు నేపథ్య సంగీతం సిద్ధం చేశారు. అదీ ఆయన ప్రతిభ. కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌.. దర్శకుడు విజయ్‌ బిన్నీకి సపోర్ట్‌ ఇచ్చారు. మూడు నెలల్లో సినిమా పూర్తి చేయడం అంత తేలిక కాదు. సమృష్టి కృషితో మాకు సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని