Nag Ashwin: అందుకే ప్రభాస్‌ ‘కల్కి’లో నటించేందుకు ఒప్పుకొన్నా. తన పాత్రను రివీల్‌ చేసిన కమల్‌!

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా ఆ చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. అందులో  కమల్‌హాసన్‌ (Kamal Haasan),  అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది.

Updated : 21 Jul 2023 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). తాజాగా విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇక ఈ సినిమాలో అమితాబ్  బచ్చన్‌, కమల్ హాసన్‌లు కీలకపాత్రల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ గ్లింప్స్‌ విడుదల ఈవెంట్‌లో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘షోలే’ సినిమా గురించి కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కమల్‌తో నటించడంపై అమితాబ్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాలోని పాత్ర కోసం కమల్ ఎంతో కష్టపడతారు. ఆయన నటించే ప్రతి చిత్రం వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ, ‘కల్కి 2898 ఏడీ’ మాత్రం చాలా ప్రత్యేకమైనది’’ అన్నారు.

రామ్‌ చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్‌

ఇక ఈ మాటలకు స్పందించిన కమల్ హాసన్‌..  ‘‘నాకు అమితాబ్‌ నటించిన ‘షోలే’ సినిమా నచ్చలేదు. అది చూశాక రాత్రంతా నిద్రపోలేదు. ఆ దర్శకుడితో పనిచేసినప్పటికీ నేను ఇదే మాట చెప్పాను. ఒక టెక్నిషియన్‌గా నేను ఆ సినిమాను ఇష్టపడలేదు. ‘షోలే’ లాంటి సినిమాలు అమితాబ్‌ కెరీర్‌లో చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు అమితాబ్‌ నా సినిమాలపై ఇంతగా ప్రశంసలు కురిపిస్తారని ఊహించలేదు’’ అని కమల్‌ హాసన్‌ సరదాగా అన్నారు.  ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను అంగీకరించడానికి కారణాన్ని కూడా కమల్‌ వివరించారు. ఒక సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యముంటుందో.. విలన్‌ పాత్ర కూడా అంతే ముఖ్యం. ఈ సినిమాలో నేను ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాను. విలన్‌ పాత్ర కాబట్టే దీన్ని అంగీకరించాను. అలాగే ఒక సినిమాకు ప్రేక్షకులు ఎంతో ముఖ్యం. నటీనటులను వాళ్లు స్టార్స్‌ చేస్తారు’ అని అన్నారు.

అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్‌ మాట్లాడుతూ.. భారతీయ పురాణాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ‘‘సూపర్‌ మ్యాన్‌, థోర్‌ లాంటి సూపర్‌ హీరోలకు హనుమంతుడికి పోలిక చెప్పే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. భారతీయ సినిమా గొప్పతనాన్ని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను’’ అంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని