Naga Chaitanya: మత్స్యకారుడిగా నాగచైతన్య.. ఫస్ట్‌లుక్‌ అదిరింది.. టైటిల్‌ ఏంటంటే?

నాగ చైతన్య 23వ సినిమా టైటిల్‌ ఖరారైంది. ఈ మేరకు విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Updated : 22 Nov 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ తర్వాత హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), డైరెక్టర్‌ చందూ మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది. సాయి పల్లవి (Sai Pallavi) కథానాయిక. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది. ‘తండేల్‌’ (Thandel) పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు అభిమానులతో పంచుకున్న నాగ చైతన్య ఫస్ట్‌లుక్‌ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. పొడవాటి జుట్టు, గడ్డం, కండలు తిరిగిన దేహంతో చైతన్య చాలా కొత్తగా కనిపించారు.

రిపోర్టర్‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టిన సల్మాన్‌.. వీడియో వైరల్‌

ఇదీ సినిమా నేపథ్యం..

2018 నవంబరులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రంలో వీరవల్‌ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున సరిహద్దు దేశం పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు బందీలుగా చిక్కారు. వీరు పాకిస్థాన్‌లో ఏడాదిన్నర పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకే కోస్టు గార్డులకు చిక్కడం, భార్యకు కాన్పు జరిగినా ఏ బిడ్డ పుట్టిందో కూడా తెలియని స్థితి, బాలింతగా భార్య అవస్థలు వంటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దానికి ఓ ప్రేమకథను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, నాగచైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబరు 1న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని