Salman Khan: రిపోర్టర్‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టిన సల్మాన్‌.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఓ రిపోర్టర్‌కు ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

Published : 22 Nov 2023 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ‘టైగర్‌3’తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఎప్పుడూ అభిమానులతో సరదాగా ఉండే ఆయన తాజాగా తన స్నేహితురాలైన ఓ రిపోర్టర్‌కు ఆప్యాయంగా ముద్దు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారంతా సల్మాన్‌ ఫ్రెండ్స్‌ను బాగా గుర్తుపెట్టుకుంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్‌ మేనల్లుడు అలీజ్ అగ్నిహోత్రి ‘ఫెర్రీ’ సినిమాతో ఇటీవలే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడితో కలిసి గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా (IFFI) వేడుకలకు హాజరయ్యారు. అక్కడ సీనియర్‌ రిపోర్టర్‌, సల్మాన్‌ స్నేహితురాలు ఎదురైంది. దీంతో ఆమెను పలకరించి ఆప్యాయంగా నుదిటిపై ముద్దుపెట్టారు. ఆమె కూడా ‘డ్రామాలు చేయకు’ అంటూ సరదాగా పలకరించింది.

‘మహాసముద్రం’లో అందుకే నటించలేకపోయా: విశ్వక్‌సేన్‌

ఇక మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్3’ విజయాన్ని అందుకుంది. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ల యాక్షన్‌ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదో సినిమాగా ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. త్వరలోనే ‘టైగర్‌4’ కూడా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని