Naga Chaitanya: అభిరామ్‌లాంటి పాత్రలు అరుదుగా వస్తాయి: నాగచైతన్య

ఏ నటుడికైనా కొన్ని మంచి పాత్రల అరుదుగా వస్తుంటాయని, అలాంటి అభిరామ్‌ అనే పాత్రను తాను పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు నాగ చైతన్య. ‘థ్యాంక్‌ యూ’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఇది. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.

Published : 12 Jul 2022 23:03 IST

హైదరాబాద్‌: ఒకే పాత్రలో పలు పార్శ్వాలు చూపించే అవకాశం అరుదుగా వస్తుంటుందని, అలాంటి అభిరామ్‌ అనే పాత్రను తాను పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు హీరో నాగ చైతన్య (Naga Chaitanya). అభిరామ్‌గా ఆయన నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’ (Thank You). విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల వేడుక నిర్వహించింది.

 

వేడుకనుద్దేశించి నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘థ్యాంక్‌ యూ కథ అభిరామ్‌ అనే వ్యక్తి ప్రయాణం. ఈ క్యారెక్టర్‌లో శారీరకంగా, మానసికంగా పలు పార్శ్వాలున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎలా కట్టిపడేస్తాయో ఈ అభిరామ్‌ జర్నీ అలానే కట్టిపడేస్తుంది. ఇంతటి మంచి పాత్రలు ఏ నటుడికైనా అరుదుగా వస్తుంటాయి. నాకీ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విక్రమ్‌, నిర్మాత దిల్‌రాజులకు కృతజ్ఞతలు. ఈ స్క్రిప్టు వినగానే ‘లైఫ్‌లో ఫలానా వారు మనకి స్పెషల్‌. వారికి ఫోన్‌ చేసి థ్యాంక్‌ యూ చెప్పాలి’ అనే ఫీలింగ్‌ మా అందరికీ కలిగింది. సినిమా చూసిన వారికీ అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకం ఉంది. రాశీఖన్నా పాత్రతో ఈ సినిమా మొదలవుతుంది. ఆమె లేకపోతే ఈ చిత్రం లేదు. మాళవిక నాయర్‌, అవికా గోర్‌, తులసి, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు తమ నటనతో ఈ సినిమాకి సపోర్ట్‌ చేశారు. విజువల్‌, మ్యూజిక్‌.. ఇలా అన్ని కోణాల్లోనూ ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది’’ అని నాగచైతన్య వివరించారు. ఈ కార్యక్రమంలో రాశీఖన్నా, దర్శకుడు విక్రమ్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని