ఇదే ‘నాంది’..రాక్షసాన్ని కూల్చడానికి! 

అల్లరి నరేష్‌ ఎక్కువగా హస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుండేవారు.  కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న‘నాంది’అనే చిత్రంతో మరోసారి తనలోని

Updated : 13 Feb 2021 13:37 IST

హైదరాబాద్‌: అల్లరి నరేశ్‌‌ ఎక్కువగా హాస్యప్రధాన చిత్రాల్లోనే నటిస్తుంటారు. కానీ, ‘నేను’ ‘గమ్యం’ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్‌’వంటి చిత్రాలు ఆయనలోని విలక్షణ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఆ తరహాలోనే త్వరలో రానున్న ‘నాంది’ చిత్రంతో మరోసారి తనలోని సీరియస్‌ నటుడిని నరేశ్‌‌ చూపించబోతున్నారు. తాజాగా ఆ చిత్రంలోనే ‘ఇదే నాంది..’ అంటూ సాగే ఎమోషనల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. సాయిచరణ్‌ పాకాల మ్యూజిక్‌ కంపోజ్‌ చేయగా సింగర్‌ విజయ్‌ ప్రకాష్‌ భావోద్వేగంగా ఈ పాటను ఆలపించారు. చైతన్య ప్రసాద్‌ దంతులూరి సాహిత్యం అందించారు. ఇటీవలే విడులైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న థియేటర్లలో విడుదల కానుంది. అప్పటిదాకా ఈ లిరికల్‌ వీడియోను చూసేయండి!

ఇవీ చదవండి!

సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హష్మీ?

అందుకే ప్రభాస్‌ని పరిచయం చేయలేకపోయా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని