Updated : 20 Jan 2022 21:38 IST

Balakrishna: థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే మజానే వేరు: బాలకృష్ణ

హైదరాబాద్‌: ఏ సినిమానైనా థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా ఉంటుందని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఆయన కీలక పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ’ (Akhanda). ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కు విచ్చేసిన బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘సమరసింహారెడ్డి’ తరువాత సుదర్శన్ థియేటర్‌కు వచ్చా. ‘అఖండ’ మూవీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. లక్షల మంది అభిమానులను సంపాదించుకోవడం గర్వంగా ఉంది. ఈ విజయం తెలుగు చలన చిత్ర విజయం. ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో ‘అఖండ’ చూస్తే అర్థమవుతుంది. ప్రగ్యా జైశ్వాల్‌ అద్భుతంగా నటించింది. సినిమా విడుదలకు ముందే ‘అఖండ’ గురించి మాట్లాడుకున్నారు. సినిమాను థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా. జనవరి 21వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్‌ కానుంది. అక్కడ కూడా సినిమాను ఆదరించాలి’’ అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అఖండ’ వందకు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడటం ఒక సంచలనం. ఈ విజయం నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులది. ఈ విజయాన్ని భగవంతుడికి, స్వర్గీయ ఎన్టీఆర్‌కి అంకితం ఇస్తున్నాం. శుక్రవారం నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘అఖండ’ వస్తుంది’’ అని అన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్