National Film Awards: అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా సాగింది.

Published : 30 Sep 2022 22:13 IST

(అనురాగ్‌ ఠాకూర్‌, ద్రౌపదీ ముర్ము, ఆశా పరేఖ్‌) 

దిల్లీ: 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల (68th Natioanl Film Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా సాగింది. 2020 సంవత్సరానికిగాను కేంద్రం ఈ ఏడాది జులైలో ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటులుగా సూర్య (Suriya) (సూరారై పోట్రు- తెలుగులో ఆకాశం నీ హద్దురా), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) (తానాజీ) అవార్డులను అందుకున్నారు. ఇదే వేడుకలో 2020గాను బాలీవుడ్‌ సీనియర్‌ నటి ఆశా పరేఖ్‌ (Asha Parekh) ప్రతిష్ఠాత్మక ‘దాదా సాహెబ్‌ అవార్డు’ను స్వీకరించారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. ‘సూరారై పోట్రు’ సినిమాకి సంబంధించి ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో జి.వి. ప్రకాశ్‌కుమార్‌, ఉత్తమ చిత్రంలో విభాగంలో జ్యోతిక (నిర్మాతగా), సుధా కొంగర (దర్శకురాలు), ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్‌ (అల వైకుంఠపురములో), ఉత్తమ తెలుగు చిత్రం (కలర్‌ ఫొటో) విభాగంలో సాయి రాజేశ్‌ (నిర్మాత), సందీప్‌రాజ్‌ (దర్శకుడు) జాతీయ అవార్డు తీసుకున్నారు. సినిమా అనేది యూనివర్సల్‌ లాంగ్వేజ్‌ అని, అది అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. అవార్డు అందుకున్నంత వారంతా సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని