Naveen Polishetty: ఆ ట్వీట్‌.. రాత్రంతా నిద్రపట్టలేదు: నవీన్‌ పొలిశెట్టి

‘మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రంపై విశేష ఆదరణ కనబరిచిన ప్రేక్షకులకు నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ధన్యవాదాలు చెప్పారు.

Published : 10 Sep 2023 13:43 IST

హైదరాబాద్‌: నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) - అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ నవీన్‌ తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు.

వర్జీనియాలో ఉన్న ఆయన ప్రమోషన్స్‌ కోసం సియాటెల్‌కు వెళ్తున్నానని.. వర్షం కారణంగా విమానాలు లేకపోవడంతో దాదాపు 15 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తున్నట్లు తెలిపారు. అనంతరం, వేరే భాషా చిత్రాలతోపాటు తమ సినిమాని విడుదల చేయడంపై మొదట్లో కంగారు పడ్డానని.. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణ సంతోషాన్నిస్తోందని తెలిపారు. తమ చిత్రాన్ని అభినందిస్తూ.. టాలీవుడ్‌ ప్రముఖులు చేసిన ట్వీట్స్‌పై మాట్లాడారు. మహేశ్‌బాబు ట్వీట్‌ చూసి తనకు నిద్రపట్టలేదని అన్నారు. తమ చిత్రాన్ని మెచ్చుకున్న సెలబ్రిటీలకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే తాను భారత్‌కు వస్తానని.. ప్రేక్షకులను కలుస్తానని అన్నారు.

ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భోళా శంకర్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

‘‘కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని చూశా. ఫుల్‌గా ఎంజాయ్‌ చేశా. నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ చక్కగా ఉంది. అనుష్క ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. దర్శకుడు మహేశ్‌బాబు, యూవీ క్రియేషన్స్‌.. ఇతర టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌’’ అని హీరో మహేశ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు రవితేజ సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని