Chiranjeevi: చిరు సరసన... ఈ ఇద్దరిలో ఒకరా?

అనుష్క... నయనతార. ఈ సీనియర్‌ కథానాయికలిద్దరి సినిమాలూ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

Updated : 09 Sep 2023 14:08 IST

అనుష్క... నయనతార. ఈ సీనియర్‌ కథానాయికలిద్దరి సినిమాలూ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. నయనతార ‘జవాన్‌’తో అదరగొడుతుండగా... అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో హంగామా చేస్తోంది. సీనియర్‌ భామలైన వీళ్లు తమ అనుభవాన్నంతా రంగరించి పాత్రల్ని రక్తి కట్టిస్తున్నారు.  వీళ్లిద్దరి పేర్లూ ఇప్పుడు చిరంజీవి సినిమా విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబరులో కానీ, నవంబరులో కానీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం కథానాయికల ఎంపికపై కసరత్తులు కొనసాగుతున్నాయి. అనుష్క, నయనతార పేర్లతోపాటు... బాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్‌ పేరుని కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు ఖరారవుతారనేది చూడాలి మరీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని