Kiran Abbavaram: ఆ రెండు ఓటీటీల్లోకి ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’
కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది.
ఇంటర్నెట్ డెస్క్: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా రూపొందిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ (Nenu Meeku Baaga Kavalsinavaadini) సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ‘ఆహా’ (Aha), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లలో ఈ నెల 14 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 16న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ కథానాయికలుగా సందడి చేశారు.
కథేంటంటే: తేజు (సంజనా ఆనంద్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోతుంది. ఇంట్లో వాళ్లకు ముఖం చూపించుకోలేక భారంగా జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసవుతుంది. అలాంటి ఆమె జీవితంలోకి క్యాబ్ డ్రైవర్ వివేక్ (కిరణ్ అబ్బవరం) ఎంట్రీ ఇస్తాడు. తేజు తాగి పడిపోయిన ప్రతిసారీ ఆమెను తన రూంలో డ్రాప్ చేసేది అతనే. ఓసారి ఆమెను ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేయబోతే కాపాడతాడు. దీంతో ఆమెకు వివేక్‌పై మంచి అభిప్రాయం ఏర్పడి.. తన విషాద గాథను అతనితో పంచుకుంటుంది. అదే సమయంలో వివేక్ కూడా తన విఫల ప్రేమకథను ఆమెతో పంచుకుంటాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి ప్రేమ కథలకు ఉన్న లింకేంటి? ఒకరి కథ మరొకరు తెలుసుకున్నాక ఇద్దరూ కలిసి ఏం చేశారు? అన్నది మిగతా కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్