నెట్‌ఫ్లిక్స్‌లోకి నేరుగా రకుల్‌ సినిమా

నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటించిన ఓ సినిమా డైరెక్ట్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జున్‌కపూర్‌-రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం....

Published : 27 Feb 2021 17:23 IST

ముంబయి: అర్జున్‌కపూర్‌-రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’. ప్రముఖ నటి నీనాగుప్తా కీలకపాత్ర పోషించారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన ఓ యువకుడు(అర్జున్‌కపూర్‌), తన బామ్మ (నీనా గుప్తా) ఆఖరి కోరిక తీర్చడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించారు. ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’లో నటించడం పట్ల నటి నీనా గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో భావోద్వేగాలతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ఆమె అన్నారు. అంతేకాకుండా తాను ఇలాంటి పాత్రను పోషించడం ఇదే మొదటిసారి అని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని