Nithiin: నితిన్‌ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌.. కారణమిదే!

ప్రస్తుతం నితిన్‌ (Nithiin) ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నారు. దీని షూటింగ్‌కు కొన్ని రోజులు విరామం ప్రకటించారు.

Updated : 11 Jan 2024 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరో నితిన్‌ (Nithiin) ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. భుజం నొప్పి కారణంగా ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరణ ఇచ్చాయి. దీంతో సంక్రాంతి వరకు షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. 

చాలా రోజుల నుంచి నితిన్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్‌’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈసారి విభిన్నమైన కథతో ‘తమ్ముడు’గా అలరించేందుకు సిద్ధమయ్యారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. దీని షూటింగ్‌ ప్రస్తుతం మారేడుమిల్లిలో జరుగుతోంది. ‘తమ్ముడు’ తనకెంతో ప్రత్యేకమని ఇటీవల నితిన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘కొన్ని టైటిల్స్‌పై ఎంతో బాధ్యత ఉంటుంది. మీ అంచనాలను మించేలా దీన్ని తెరకెక్కిస్తాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు