Nootokka Jillala Andagadu: ఆ ఓటీటీలో శ్రీనివాస్‌ అవసరాల ‘నూటొక్క జిల్లాల అందగాడు’

వైవిధ్య కథలు, పాత్రలతో అలరించే యువ నటుల్లో అవసరాల శ్రీనివాస్‌ ఒకరు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం

Updated : 05 Dec 2021 18:23 IST

హైదరాబాద్‌: వైవిధ్య కథలు, పాత్రలతో అలరించే యువ నటుల్లో అవసరాల శ్రీనివాస్‌ ఒకరు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ స్ట్రీమింగ్‌ అవుతోంది. పెళ్లికాక ముందే బట్టతల రావడంతో అది కనిపించకుండా గొత్తి సత్యనారాయణ అనే యువకుడు విగ్గు పెట్టుకుంటాడు. అది చూసి అందరూ అతడిది నిజమైన జుట్టు అనుకుంటారు. ఒక అమ్మాయి కూడా ప్రేమలో పడుతుంది. బట్టతల కనపడనీయకుండా చేసేందుకు సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు ఏంటి? తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అతడిని ప్రేమించిందా? తదితర ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ ఈ చిత్రాన్ని సమర్పించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని