NTR: ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు....

Updated : 06 May 2022 11:00 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కొరటాల శివ, ప్రశాంత్‌నీల్‌ ప్రాజెక్ట్స్‌ని ఆయన లైనప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్‌ తన అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఓ స్పెషల్‌ పిక్‌ షేర్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్‌నీల్‌, ఆయన సతీమణి లిఖిత కూడా ఉన్నారు. ప్రశాంత్‌నీల్‌-లిఖితల వివాహ వార్షికోత్సవం కూడా మే 5నే కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను తారక్‌ షేర్‌ చేస్తూ.. ‘‘ఒకే రోజు మా ఇరు జంటల వార్షికోత్సవాలు కావడం.. వేడుకగా ఉంది.. ఇదొక నూతన ఆరంభం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు.. ‘మీ కాంబినేషన్‌లో సినిమా కోసం వెయిటింగ్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని