మరోసారి తెరపై గౌతమ్‌ మేనన్‌

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెర వెనుకే కాదు తెర ముందు అలరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లోనూ కనిపించి సందడి...

Published : 26 Apr 2021 14:17 IST

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెర వెనుకే కాదు తెర ముందు అలరిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లోనూ కనిపించి సందడి చేశారాయన. ఎక్కువగా పోలీస్‌ అధికారి పాత్రల్లో మెప్పించిన గౌతమ్‌ మేనన్‌ మరోసారి అలాంటి పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విడుదలై’. సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ శక్తిమంతమైన పోలీస్‌ అధికారిగా గౌతమ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓ పది రోజులు చిత్రీకరణలో పాల్గొన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని