Pushpa: ‘ఫ్లవర్ కాదు.. ఫైరు..’ అయింది వన్ ఇయరు..! ‘పుష్ప’ రికార్డులివే!
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-1’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
ఇంటర్నెట్‌డెస్క్: ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’ అంటూ పాన్ ఇండియాలో స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (Allu arjun). ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) విడుదలై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. పుష్పరాజ్‌గా బన్ని నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇలా ఒక్కటేంటి భారత సినీ ప్రేక్షకులను ఒక మాస్ అవతార్ ఆవహించింది. మీమ్స్, రీల్స్, రైమ్స్, చిప్స్, చిన్నా, పెద్దా అంతా ‘తగ్గేదేలా’ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తించారు. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడమే కాదు, రికార్డులను సైతం ‘పుష్పరాజ్’ సృష్టించాడు. మరి ఈ సినిమా ఏడాది పూర్తయిన సందర్భంగా ‘పుష్ప1’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
🪓 ‘ఆర్య’తో బన్ని కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని మైలురాయిని వేశారు సుకుమార్. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య2’ పర్వాలేదనిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్, సుకుమార్ చేతులు కలిపారు.
🪓 ‘పుష్ప’ కథను తొలుత మహేశ్‌బాబుకు చెప్పారట సుకుమార్. ఆయనకు కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అంతకుముందే ఒప్పుకొన్న ప్రాజెక్టుల కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం, ఇతర కారణాల వల్ల ప్రాజెక్టు ఆగిపోయింది. ‘పుష్ప’ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. మహేశ్‌కు చెప్పిన కథ ఇదే నేపథ్యమైనా స్టోరీ లైన్ వేరని సుకుమార్ ఆ తర్వాత తెలిపారు.
🪓 అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురూ కలిస్తే, సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. ‘పుష్ప’ విషయంలోనూ అదే మేజిక్ రిపీట్ అయింది. ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు, 6 బిలియన్ + వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి.
🪓 డిసెంబరు 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్లో అత్యధికమంది వీక్షించిన, లైక్ చేసిన వీడియో ‘పుష్ప’టీజర్ నిలిచింది.
🪓 ఓటీటీలోనూ ‘పుష్ప’అదరగొట్టింది. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప అలరించింది. 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
🪓 అవార్డుల విషయంలోనూ పుష్పరాజ్ ‘తగ్గేదేలే’అంటూ దూసుకుపోయాడు. ఏడు ఫిల్మ్ఫేర్లు, మరో ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
🪓 ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు..’, ‘సరకు ఉంటే పుష్ప ఉండడు.. పుష్ప ఉంటే సరకు ఉండదు.. రెండింటినీ కలిపి చూడాలనుకుంటే మీరు ఎవ్వరూ ఉండరు’, ‘నేను ఇక్కడ బిజినెస్‌లో ఏలుపెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చా.. తగ్గేదేలే’లాంటి డైలాగ్‌లు బాగా ఫేమస్ అయ్యాయి.
‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్ రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైన ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన ‘పుష్ప’ ఎర్రచందనం సిండికేట్‌ను లీడ్ చేసే వ్యక్తిగా ఎలా ఎదిగాడో పార్ట్-1లో చూపించారు. సీక్వెల్లో శత్రువులైన ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, జాలిరెడ్డి, మంగళం శ్రీను, దాక్షాయినిల నుంచి పుష్పరాజ్‌కు ఎదురైనా ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అన్నది చూపించబోతున్నారు. అంతేకాదు, ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..