Balakrishna: ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌లో మార్పు వచ్చింది..!

‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) ట్రైలర్‌ను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri GopalaKrishna).

Published : 11 Oct 2023 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలకృష్ణ (Balakrishna) - అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). నిర్మాణాంతర పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ అందరినీ మెప్పించి అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్‌ గురించి తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. పరుచూరి పలుకుల్లో భాగంగా ఆయన దీనిని విశ్లేషించారు.

‘‘సినిమా ఎంత గొప్పగా ఉంటుందో ట్రైలర్‌లోనే చూపించడం కూడా ఒక టాలెంట్‌. 2 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ చూస్తే అనిల్‌రావిపూడి అంటే ఏంటో అర్థమవుతుంది. సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే దాని తర్వాత వచ్చే మూవీ గురించి హీరోలు, దర్శకులు కొంత టెన్షన్‌ పడుతుంటారు. అలాంటిది బాలకృష్ణ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’లతో వరుసగా రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్‌లను అందుకున్న తర్వాత ‘భగవంత్‌ కేసరి’తో పలకరించనున్నాడు. అలాంటప్పుడు ఎవరికైనా దీనిపై ఉత్సుకత ఉంటుంది. ట్రైలర్‌ చూశాక అన్ని సందేహాలు తొలగిపోయి అభిమానుల్లో కేవలం ఉత్సాహం మాత్రమే కలిగేలా ఉంది. ‘అఖండ’తర్వాత బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీలో మార్పు వచ్చింది. ‘భగవంత్‌ కేసరి’ బాలకృష్ణకు సరిపోయేకథ. ఇది తండ్రి కూతుళ్ల కథలా అనిపిస్తుంది. కూతురిని కాపాడటం కోసం తండ్రి పడే తపనను చూపించారు. అలాగే ‘బిడ్డ ముందు తండ్రి నిలబడితే వంద దేవుళ్ల లెక్క’ వంటి డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు పండగను తెస్తుందని భావిస్తున్నా’ అంటూ సినిమా హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పరుచూరి తెలిపారు.

Social look: రష్మిక లిప్‌లాక్‌.. అషు యాటిట్యూడ్‌.. కత్రినా ఫైర్‌..

ఇక ‘భగవంత్‌ కేసరి’ విషయానికొస్తే.. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌ అంశాలతో పాటు అనిల్‌ శైలి వినోదాలతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ మిలియన్‌ వ్యూస్‌తో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని