Pawan kalyan: పాకిస్థాన్‌లోనూ టాప్‌ ట్రెండింగ్‌లో ‘బ్రో’.. ఏ స్థానంలో ఉందంటే?

‘బ్రో’(BRO) చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం అక్కడ రికార్డులు సృష్టిస్తోంది.

Updated : 31 Aug 2023 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej)తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’(BRO). జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. అయితే, ఓటీటీలో ఈ చిత్రం ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనూ ‘బ్రో’ సినిమా రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 

అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ఆ విషయం ఎవరికీ చెప్పను: విజయ్‌ దేవరకొండ

నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయిన దగ్గరి నుంచి ఈ చిత్రం టాప్‌లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇండియాలో నం.1లో ఉండగా..  నాన్‌ ఇంగ్లిష్‌ సినిమాల లిస్ట్‌లో టాప్‌7లో నిలిచింది. అలాగే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో టాప్‌8లో ఉంది. దీంతో పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ఇక జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయింది. తమిళంలో వచ్చిన ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాయడం విశేషం. పవన్‌ కల్యాణ్‌ కాలం అనే దేవుడి పాత్రలో కనిపించగా.. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.  ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని