Pawan Kalyan: సాహో దర్శకుడితో పవన్‌ కొత్త సినిమా.. అధికారికంగా ప్రకటించిన టీం..

సాహో దర్శకుడితో పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. దీని పోస్టర్‌ను ఈరోజు రిలీజ్‌ చేశారు.

Published : 04 Dec 2022 10:46 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.  ఆయనతో సినిమా చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. డీవీవీ ఎంటర్‌టైనర్స్‌. పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీనికి సాహో ఫేమ్‌ సుజిత్‌ దర్శకుడు. ఇక పవన్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి ‘ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌’ అనే వ్యాఖ్యను జోడించారు. పోస్టర్‌ పై THEY CALL HIM #OG అని రాసి ఉంది. అలాగే జపనీస్‌ భాషలోనూ ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌ అనే పదాన్ని రాశారు. ఇందులో పవన్‌ కూడా కనిపిస్తున్నారు. పోస్టర్ ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి  బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి వస్తున్న ఈ చిత్రానికి  రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహరవీరమల్లులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు హరీశ్‌ శంకర్‌తో కలిసి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’తో అలరించనున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని