Pooja Bhatt: తల్లీకూతుళ్లంటూ అక్కాచెల్లెళ్లపై రూమర్స్‌.. స్పందించిన నటి

అలియా భట్‌ తన కుమార్తె అంటూ గతంలో వచ్చిన రూమర్స్‌పై పూజా భట్‌ స్పందించారు. ఆమె ఏమన్నారంటే?

Published : 13 Sep 2023 02:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అలియా భట్‌ (Alia Bhatt) తన కుమార్తె అంటూ గతంలో వచ్చిన రూమర్స్‌పై నటి, నిర్మాత, దర్శకురాలు పూజా భట్‌ (Pooja Bhatt) స్పందించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సంబంధిత వదంతులపై స్పందించాలని హోస్ట్‌ కోరగా పూజా భట్‌ ఇలా పేర్కొన్నారు. ‘‘ఇలాంటి వదంతులు మన దేశంలో కొత్తేమీ కాదు. దానికి బదులిచ్చి.. ఆ వ్యవహారానికి గౌరవాన్ని కూడా చేకూర్చుతారా?’’ అని పేర్కొన్నారు. ఈ పూజా భట్‌ ఎవరోకాదు ప్రముఖ దర్శకుడు మహేశ్‌ భట్‌ (Mahesh Bhatt) తొలి భార్య కుమార్తె. అలియా భట్‌ ఆయన రెండో భార్య కుమార్తె. అక్కాచెల్లెళ్లైన వీరిద్దరిపై తల్లీకూతుర్లంటూ రూమార్స్‌ రావడం గమనార్హం. ‘డాడీ’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసిన పూజా ‘సడక్‌’, ‘దిల్‌ హై కీ మంతా నహీ’ చిత్రాలతో 19 ఏళ్లకే స్టార్‌ అయ్యారు.  ప్రస్తుతం ఆమె నిర్మాత, సహాయ నటిగా అలరిస్తున్నారు. ‘సడక్‌ 2’, ‘బాంబే బేగమ్స్‌’, ‘చుప్‌’ చిత్రాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌ పలు చిత్రాల్లో సందడి చేసిన అలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.

పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు ఎందుకు హైలైట్‌ చేస్తున్నారు? కారణం అదేనా?

తన తండ్రితో 33 ఏళ్ల క్రితం జరిగిన ఫొటోషూట్‌పైనా పూజా సదరు ఇంటర్వ్యూలో తొలిసారిగా స్పందించారు. ఆ షూట్‌లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని అన్నారు. తమ ఉద్దేశం మంచిదేనని.. కాకపోతే చూసేవాళ్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ‘‘అది చాలా సాధారణమైన విషయం. ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకోవడం దురదృష్టకరం. ఫొటోషూట్‌పై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో షారుఖ్‌ ఖాన్‌ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు.. తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దుపెట్టుకుంటారు. పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు’’

‘‘నిజం చెప్పాలంటే, ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పాపలానే చూస్తారు. ఈ ఫొటోషూట్‌ జరిగినప్పుడు సమాజం గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. విషయం ఏదైనా సరే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. ఒక తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని వేరేలా చూడాలనుకుంటే వాళ్లు ఏదైనా ఊహించుకుంటారు. కామెంట్స్‌ చేస్తారు. అలాంటి వాళ్లే మళ్లీ కుటుంబ విలువల గురించి ప్రసంగాలిస్తారు. అదే అతిపెద్ద జోక్‌’’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు