Pooja Hegde: షాహిద్‌తో పూజ

తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమై, వరుసగా తెలుగు చిత్రాలలో నటించే ఆఫర్లు సొంతం చేసుకుంటూ, అటు హిందీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందీ ముంబయి భామ పూజా హెగ్డే.

Updated : 14 Oct 2023 13:36 IST

తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమై, వరుసగా తెలుగు చిత్రాలలో నటించే ఆఫర్లు సొంతం చేసుకుంటూ, అటు హిందీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందీ ముంబయి భామ పూజా హెగ్డే. ప్రేమకథా సినిమాలే కాదు యాక్షన్‌ సినిమాలు కూడా చేయడానికి బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందని ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌కు జోడీగా పూజ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం పూజ పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రయూనిట్‌. ఓ యువ పోలీసు అధికారి కేసు దర్యాప్తు చేసే సమయంలో ఎదురైన సవాళ్ల చుట్టూ తిరిగే కథనంతో దర్శకుడు రోషన్‌ ఆండ్రూస్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ్‌ రాయ్‌ నిర్మిస్తున్న ఆ సినిమా గురించి పూజ మాట్లాడుతూ...‘ఆసక్తికరమైన కథాంశంతో కూడిన ఈ ప్రాజెక్టు చాలా ప్రత్యేకమైనది’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని