Pooja hegde : ఎవరితో జోడీ కట్టేనో?

తెలుగులో మొన్నటిదాకా అగ్ర హీరోలు మొదలుకొని...యువతారల చిత్రాల వరకూ కథానాయిక ఎంపిక పూజాహెగ్డే నుంచే మొదలయ్యేది. ఆమె కాల్షీట్లు ఖాళీ లేకపోతేనో... లేదంటే చేయలేనని చెబితేనో అవి మరొకరి దగ్గరికి వెళ్లేవి.

Updated : 05 Dec 2023 09:29 IST

తెలుగులో మొన్నటిదాకా అగ్ర హీరోలు మొదలుకొని...యువతారల చిత్రాల వరకూ కథానాయిక ఎంపిక పూజాహెగ్డే నుంచే మొదలయ్యేది. ఆమె కాల్షీట్లు ఖాళీ లేకపోతేనో... లేదంటే చేయలేనని చెబితేనో అవి మరొకరి దగ్గరికి వెళ్లేవి. అంతగా ఆమె ప్రభావం చూపింది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేది. కానీ ఒక్కసారిగా ఆమె తెలుగు పరిశ్రమకి విరామం ఇచ్చింది. కొంతకాలంగా బాలీవుడ్‌ ప్రాజెక్టులపైనే దృష్టిపెట్టింది. త్వరలోనే ఆమె తెలుగు సినిమాలతో మళ్లీ బిజీ కానున్నట్టు సమాచారం. కొంతకాలంగా తెలుగు దర్శకనిర్మాతలు చెబుతున్న కథల్ని వింటూ వచ్చిన పూజా... త్వరలోనే ఒకట్రెండు సినిమాలకి పచ్చజెండా ఊపడానికి సిద్ధమైనట్టు సమాచారం. అందులో నాని సినిమా కూడా ఉందని ప్రచారం సాగుతోంది. నాని కథానాయకుడిగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందే అవకాశాలున్నాయి. ఆ సినిమా కోసం పూజాహెగ్డేని కథానాయికగా ఎంపిక చేసుకోనున్నట్టు తెలుస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌, సాయిధరమ్‌ తేజ్‌ తదితరుల చిత్రాల్లోనూ ఆమె నటించే అవకాశాలున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని